Sunday, January 19, 2025

నాగార్జున సాగర్ కు భారీ వరద… 20 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 20 గేట్లను అధికారులు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 3.80 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటి మట్టం 585.2 అడుగులుగా ఉంది. సాగర్ జలాశయంలో పూర్తి నీటి నిల్వ సామర్థం 312.50 టిఎంసిలుండగా ప్రస్తుత నీటి నిల్వ 298.01 టిఎంసిలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News