Sunday, January 19, 2025

పోటెత్తిన వరద.. నాగార్జున సాగర్‌ డ్యామ్ 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కు భారీగా వరద పొటెత్తుతోంది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. 12 గేట్లు 10 అడుగులు, 14 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి.. 5,01,014 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ లోకి 4,91,792, క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.90 అడుగులకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News