Monday, January 20, 2025

లక్ష్మి బ్యారేజ్‌లో 36గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టులో వరుద ఉదృతి అధికంగా ఉండటంతో అధికారులు 36గేట్లను ఎత్తి వచ్చిన నీటిని దిగువకు వదిలారు. కాళేశ్వరం నుండి కన్నెపల్లి పంపు హౌజ్ ద్వారా ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోస్తున్నారు. గురువారం ఏడు మోటర్లను రన్ చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వద్ద 7.3మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుందని సీడబ్లూసీ అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నది వరుద నీరు కాళేశ్వరంకు భారీగా చేరుకుంటుంది. ప్రాణహిత నది నుండి 11లక్షల48వేల క్యూసెక్కుల నీరు వస్తున్నందున అధికారులను 36గేట్లను ఎత్తి లక్ష12వేల320క్యూసెక్కుల నీటిని హౌట్‌ప్లోగా వదిలారు. లక్ష్మి పంపు హౌజ్ నుండి 12వేల708 క్యుసెక్కుల వరుద నీరు ఏడు మోటర్లతో అన్నారం బ్యారేజీకి చేరుకుంది. ఈ రెండు ఔట్‌ప్లో కలిపి లక్ష25వేల ఎనిమిది క్యూసెక్కుల నీరు ఔట్‌ప్లోగా ఉంది. ప్రస్తుతం లక్ష్మి బ్యారేజ్‌లో 11వేల418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కన్నెపల్లి పంపు హౌజ్ నుండి మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. గత రాత్రి వరకు ఆరు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. శుక్రవారం వరకు ఏడు టీఎంసీల నీటిని పంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్నారం బ్యారేజీ వద్ద కన్నెపల్లి పంపు హౌజ్ ద్వారా ఎత్తిపోసిన నీరు 8472 క్యూసెక్కుల ఇన్‌ఫో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్నారం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఎనిమిది టీఎంసీల నీరు ఉందని, ఇంకా సమృద్ధిగా నీరు చేరిన తరువాత గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News