Sunday, December 22, 2024

కళ్యాణి వాగు నాలుగు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కళ్యాణివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల గుండా ప్రాజెక్టులోకి వెయ్యి క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ప్రాజెక్ట్ నాలుగు రేడియల్ గేట్లను మంగళవారం ఉదయం ఎత్తివేశారు. ఒకటి, రెండు, మూడు ఆరు రేడియల్ గేట్లను ఎత్తి 900 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు.

మరో వంద క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువలోకి మళ్లించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిటిమట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్థుతం 408 మీటర్ల నీరు నిలువ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గితే రేడియల్ గేట్లను కిందికి దించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News