Sunday, January 26, 2025

నాగార్జున సాగర్ లో రెండు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. సిఇ, ఇతర అధికారులు రెండు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. 13, 14 నంబర్ గేట్లను ఎత్తామని నాగార్జున సాగర్ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్ రావు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు తరువాత నాలుగు గేట్లను నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెరవనున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 3.75 లక్షల క్యూసెక్కులు ఉంది.  సాయంత్రానికి 14 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేయనున్నారు. ఇవాళ్టి నుంచి లక్ష నుండి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇ.యన్.సి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News