Saturday, November 2, 2024

చార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Lifting the ban on Chardham Yatra

సందర్శకుల సంఖ్యపై రోజువారీ పరిమితి హైకోర్టు విధింపు
కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సూచన

నైనిటాల్ : ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం చార్‌ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేసింది. ధర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితి విధించాలని సూచించింది. కొవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేదార్‌నాధ్, బద్రీనాధ్, గంగోత్రి, యుమునోత్రి, ధామ్‌లను సందర్శించే భక్తులకు కరోనా పరీక్ష నెగిటివ్ రిపోర్టులు, టీకా డోసులు తీసుకున్న సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించింది. భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితి విధించాలని పేర్కొంది.న కేదార్‌నాధ్ ఆలయంలో 800, బద్రీనాధ్ ఆలయంలో 1200 , గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని హైకోర్టు వివరించింది.

ఆయా ఆలయాల పరిసరాల్లోని వాగుల్లో భక్తులు ఎవరూ స్నానాలు చేయరాదు. ఈ యాత్రల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ బలగాలను మోహరింప చేయాలని కోర్టు సూచించింది. కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని గతంలో ఛార్‌ధామ్ యాత్రకు అనుమతించడానికి హైకోర్టు నిరాకరించింది. కొవిడ్ పరిస్థితులు మెరుగుపడినందున భక్తులు వచ్చేందుకు యాత్రకు అనుమతించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. యాత్రకు వచ్చే పర్యాటకులపై ఎందరో ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొంది. దీన్ని విచారించిన కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News