Monday, December 23, 2024

మళ్లీ తిరిగొస్తాం…అప్పటి దాకా… : ఛార్మీ

- Advertisement -
- Advertisement -

 

Charmy

హైదరాబాద్: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమా ‘లైగర్’ విడుదలకు ముందే ఎంతో హైప్ తో ప్రచారం మొదలెట్టింది. కానీ తీరా అది థియేటర్లలో రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల ఆశల మేరకు లేకుండా ‘డిజాస్టర్’ అయింది. ప్రేక్షకులు సినిమా చూసిన మొదటి రోజే నెగటివ్ టాక్ మొదలెట్టారు.  వారం రోజుల్లోనే సినిమాలో పసలేదని టాక్ వచ్చింది. పూరీ, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ దాదాపు వంద కోట్ల రూపాయాల భారీ బడ్జెట్తో నిర్మించిన  ఈ చిత్రం అందులో సగం కూడా రాబట్టలేక పోయిందని తెలుస్తోంది. ఈ భారీ డిజాస్టర్ అటు హీరో విజయ్ తో పాటు దర్శకుడు పూరీ, సహ నిర్మాత ఛార్మీ  కౌర్ ను కూడా తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిసింది. అయినా సినిమా నిర్మించే వాళ్లు ప్రేక్షకులు ఏమీ కావాలనుకుని థియేటర్ కు వస్తారో కూడా చూసుకుని సినిమా నిర్మిస్తే మంచిది. కేవలం వారి కోణం నుంచి తీసే సినిమా ఇలానే ఉంటుంది. వాస్తవానికి పూరీ జగన్నాథ్ సినిమా ఇలా ఉంటుందని ఎవరన్నా భావించారా?…

ఈ నేపథ్యంలో సహ నిర్మాత ఛార్మీ కౌర్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆమె ట్వీటే స్పష్టం చేసింది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆమె ఓ ట్వీట్ చేసింది. ‘గాయ్స్ కాస్త శాంతించండి. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా నుంచి. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ  తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి. బ్రతకనివ్వండి’ అంటూ హార్ట్ ఎమోజీని యాడ్ చేసి మరీ ఛార్మీ  ట్వీట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News