Sunday, December 22, 2024

స్లమ్ డాగ్ నుంచి అంతర్జాతీయ బాక్సర్‌గా…

- Advertisement -
- Advertisement -

Liger movie first glimpse released

 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్‌లైన్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో నూతన సంవత్సరం కానుకగా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండను స్లమ్ డాగ్‌గా.. ముంబయ్ వీధుల్లో చాయ్ వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్‌గా ఎదిగినట్లు చూపించారు. ఇందులో విజయ్ తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ.. అతనిలోని టాలెంట్‌ని గుర్తించిన బాక్సింగ్ కోచ్‌గా బాలీవుడ్ నటుడు రోనీత్ రాయ్ కనిపించారు. మిక్స్ మార్షల్ ఆర్ట్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించడానికి విజయ్ దేవరకొండ పడిన శ్రమంతా ’లైగర్’ గ్లిమ్స్‌లో కనిపిస్తోంది. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న విజయ్ కండలు తిరిగిన దేహంతో అదరగొట్టాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ 2022 ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News