పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ని దూకుడుగా చేస్తోంది. ‘లైగర్’ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈనెల 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ట్రైలర్ ప్రకటన పోస్టర్‌లో చుట్టూ ఫైటర్‌లు వుండగా విజయ్ మధ్యలో వుండి ఫైట్‌కి సిద్ధమవ్వడం గమనించవచ్చు. ట్రైలర్‌లో మైక్ టైసన్‌తో సహా ఇతర నటీనటులు, సినిమా కంటెంట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది. ‘లైగర్’లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. పూరి కనెక్ట్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
LIGER Movie Trailer to Release on July 21