Friday, December 20, 2024

మైక్ టైసన్ బర్త్‌డే కానుకగా…

- Advertisement -
- Advertisement -

LIGER Team birthday wishes to Mike Tyson

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలోకి అడుగుపెడుతున్నారు. మైక్ టైసన్ పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, ఛార్మీ కౌర్, విష్ణు, అనన్య పాండే, పూరీ జగన్నాధ్‌లు టైసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ‘లైగర్’ యుఎస్ షెడ్యూల్ మేకింగ్ విజువల్స్ ఈ వీడియోలో అలరించాయి. ఈ చిత్రానికి సంబంధించి మైక్ టైసన్ సన్నివేశాలు యుఎస్‌లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ‘లైగర్’లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. పూరి కనెక్ట్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 25న విడుదల చేయనున్నారు.

LIGER Team birthday wishes to Mike Tyson

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News