Thursday, January 23, 2025

‘గాడ్ ఫాదర్’ సెట్‌లో ‘లైగర్’ టీమ్

- Advertisement -
- Advertisement -

'LIGER' Team in Sets of 'Godfather' Movie

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ ఈనెల 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్‌టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాలోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్ అక్డీ పక్డీ, వాట్ లగా దేంగే సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌ను లైగర్ చిత్ర బృందం సందర్శించింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై స్పెషల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. తమ సినిమా కోసం ఇద్దరు సూపర్ స్టార్ల ఆశీస్సులు తీసుకుంది లైగర్ టీమ్. ఇద్దరు సూపర్ స్టార్స్ లైగర్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూరి కనెక్ట్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

‘LIGER’ Team in Sets of ‘Godfather’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News