Wednesday, January 22, 2025

సౌత్, నార్త్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్

- Advertisement -
- Advertisement -

'LIGER' Trailer to release on July 21st

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ ఈనెల 21న విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్‌తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్, ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి చర్చిస్తున్న వీడియోని ఈ సందర్భంగా విడుదల చేశారు. హైదరాబాద్ ఈవెంట్ ఆర్‌టీసి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ఈనెల 21న ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. ముంబై ఈవెంట్ అంధేరిలోని సినీ పోలిస్‌లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ స్పోర్ట్ యాక్షన్ డ్రామాతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

‘LIGER’ Trailer to release on July 21st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News