Monday, December 23, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ క్రేజ్

- Advertisement -
- Advertisement -

Liger Vijaya devarakonda movie

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన మైలురాయిని దాటాడు.

అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా అభిమానులు ఉన్న టాలీవుడ్ హీరోలలో అతను ఒకడు. విజయ్ దేవరకొండ ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో బహుభాషా చిత్రం ‘జన గణ మన’కు సంతకం చేశాడు. ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరోకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగా పెరుగుతుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News