Monday, December 23, 2024

గొర్రెల పంపిణీతో గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -

కోడేరు : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కులవృత్తులను ఆదుకోవడమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత గొర్రెల యూనిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో మొదటగా ఇక్కడే గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు.

గొర్రెల పంపిణీ పథకం గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ గాడిన పెడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.అనంతరం నర్సాయిపల్లి గ్రామంలో నూతన పశు వైద్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News