Wednesday, January 22, 2025

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసరాల నుండి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తన కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాగల 24గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మదనపల్లిలో అత్యధికంగా 31.5మి.మీ వర్షం కురిసింది. శంకర్‌పల్లిలో 30, లింగాపూర్‌లో 25, నవాబ్ పేటలో 24.8, మల్లాపురంలో 23.5, వీపనగండ్లలో 22.5, చెన్నపురావుపల్లిలో 22.3, తెల్కపల్లిలో 21.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News