Monday, December 23, 2024

మరో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో రెండు రోజులపాటు ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ వాయువ్య దిశల నుండి వీస్తున్నట్టు తెలిపింది. గురువారం ఉరుములు మెరుపులతో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి, మమబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ ,

వనపర్తి, నారాయణపేట్ , జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డిలో 107 మి.మి వర్షం కురిసింది. మొగ్ధంపల్లిలో 98.,హత్నూరలో 61.7, కామారెడ్డి జిల్లా గాంధారలో 50 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News