Monday, November 25, 2024

19 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో ఈనెల 19వరకూ తేలికపాటి నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News