Friday, November 22, 2024

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల 24గంటల్లో రా్రష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరదక్షిణ ద్రోణి పశ్చిమ మధ్యప్రదేశ్ నుండి విదర్భ , తెలంగాణ , ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మి ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడా ఒకమోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులు గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. బూర్గంపహడ్‌లో 25మి.మి, సదాశివునిపాలెంలో 21, భద్రాచలంలో 15, మంచిర్యాలలో 8.5మి.మి వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తుంపర్లు పడ్డాయి.

రాగల మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40నుండి 42డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్ , చుట్టుపక్కల ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38నుండి 40డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 42.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తంగుల్లలో 43.8 జూలూరుపాడులో 43.8, హాజీపూరలో 43.6, గార్లలో 43.5, వీణవంకలో 43.4 డిగ్రీలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News