Sunday, December 22, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

- Advertisement -
- Advertisement -

Light showers in many parts of Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం చిరుజల్లులు పడుతున్నాయి. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. భారీగా వర్షం కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. గడిచిన రెండ్రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురిశాయి.  రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకట్రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం కొంత చల్లబడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News