మనతెలంగాణ/హైదరాబాద్ : వేసవి ముదురుతు న్న కొలదీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పైపైకి పెరిగిపోతున్నాయి. ఈ సీజన్‌లో గురువారం అ త్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 45 డిగ్రీలు దాటేశాయి. నల్లగొండ జిల్లా మాడుగుల పల్లిలో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన ఉ ష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా హజిపురలో 45.2, వనపర్తి జిల్లా వెల్గొండలో 45. 1, ములుగు జిల్లా కాసిమ్‌దేవ్ పల్లి .వనపర్తి జిల్లా గొర్రెకుంట,ములుగు జిల్లా మేడారం , మంగపేట కేంద్రాల్లో 45.1డిగ్రీలు నమోదయ్యాయి. కొమ్మె ర,వెల్గటూరు, అయ్యగారిపల్లి 45డిగ్రీలు నమోదయ్యాయి.
శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని జి ల్లాల్లో 2నుండి 3డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ విదర్భ నుండి మరఠ్వాడ ,ఉత్తర అం తర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మి ఎత్తు లో కొనసాగిన ద్రోణి బలహీనపడింది. మన్నార్ గ ల్ఫ్ నుండి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కి.మి ఎత్తులో కొనసాగిన ద్రోణి కొమరిన్ ప్రాంతం నుండి అంతర్గత తమిళనాడు ,రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మి ఎత్తులో కొనసాగుతోంది.
ధర్మాసాగర్‌లో 31.3 మి.మి వర్షం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఉరుములు మెరుపులతో గంటకు 30నుండి 40కి.మి వేగంతో వీచే ఈదురు గాలులతో కూడి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. కాగా గురువారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా దర్మాసాగర్‌లో 31.3మి.మి వర్షం పడింది. ప్రొద్దటూరులో 13.3, దొమ్మాయిగూడ,బండ్లగూడలో 12, కుషాయిగూడలో 10.8, సఫాయిగూడలో 5.3, రాజీవ్‌నగర్‌లో 5,మౌలాలిలలో 4.5, మన్నెగూడలో 3.5, ధరూర్‌లో 3.3, కాప్రాలో 2.3,మల్కాజిగిరిలో 2, ప్రశాంత్‌నగర్లో 2 మి.మి చొప్పున వర్షం కురిసింది.