Monday, December 23, 2024

రానున్న మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

- Advertisement -
- Advertisement -

Light to moderate rains for the next three days

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశం ఉన్నట్టు వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. మాల్డీవులు, కొమోరిన్ ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News