Thursday, January 23, 2025

పోడు పట్టాలతో గిరిజనల జీవితాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -

గుండాల: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షడు రేగా కాంతరావు అన్నారు. గత పాలకులు ఏనాడూ పోడు భూముల పట్టాల సమస్యను పట్టించుకోలేదన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సభలో 4322 రైతు కుటుంబాలకు 18604 ఎకారలు పోడు భూముల పట్టాలు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ…సీఎం కేసిఆర్ కృషితో పంపిణీ చేసిన పోడు పట్టాలతో గిరిజన జీవితంలో వెలుగులు విరజిమ్మయని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది అన్నారు.

పోడు రైతుల దశాబ్ధాల సమస్యలను పరిష్కారం చుపారని అన్నారు. అలాగే పోడు రైతులకు రైతు బందుతో పాటు రైతు బీమా వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుత పట్టాలకు ఎలాంటి వర్తింపులు వర్తిస్తున్నావో నేడు పంపిణీ చేస్తున్న పోడు పట్టాలకు అన్ని వర్తిస్తాయి అని తెలిపారు. గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకె కాకుండా అన్న వర్గాల ప్రజల విద్యార్థులకు గురుకుల పాఠశాలలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని అయన అన్నారు. పోడు భూములకు స్వాశిత పరిష్కారం చేసి పోడు సాగుదారులకు పట్టాలు మంజూరు చేసినందుకు నియోజకవర్గ, జిల్లా పోడు సాగుదారుల తరుపున సీఎం కేసీఆర్‌కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ముక్తి సత్యం, జెడ్పీటిసి రామక్క, రైతు సమన్వయ సమితి అధ్యక్షడు వీరాస్వామి, తహసీల్ధార్ నాగదివ్య, ఎంపిడివో సత్యనారయణ, ఎంపివో హజ్రత్ వాలీ, ఎస్సై రాజశేఖర్, ఎంపిటిసిలు కృష్ణరావు, పద్మ, రాజేశ్వరి, సర్పచులు కొరం సీతారాములు, మోహన్, సమయ్య, జయసుద, పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News