Friday, November 15, 2024

మోత్కూరులో అకాల వర్షం…. దాచారంలో తాటి చెట్టుపై పడిన పిడుగు

- Advertisement -
- Advertisement -

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం రాశులు
దాచారంలో పిడుగుపాటుకు కాలిపోయిన తాటిచెట్టు

Lightening in Dacharam

 

మన తెలంగాణ/మోత్కూరు : మోత్కూరు మండలంలో సోమవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి చేలల్లో ధాన్యం రాలింది. ఇప్పటికే రైతులు వరి చేలు కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, కళ్లాల్లో పోసిన ధాన్యం వర్షానికి తడిసింది. పలుచోట్ల వరద నీటికి ధాన్యం కొట్టుకపోయింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో కోతకు వచ్చిన వరి చేలు దెబ్బతింటాయని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు కాలిపోయింది. ప్రభుత్వం, అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని, వర్షానికి తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News