Thursday, January 23, 2025

విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మే: టిఎస్‌పిఈజేఏసీ

- Advertisement -
- Advertisement -

Lightning strike if power companies are privatized: TSPEJAC

హైదరాబాద్: విద్యుత్ సంస్థలను ప్రవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని నేషనల్ కో ఆర్దినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రసిటీ ఎంప్లాయిస్ అండ్( ఇంజనీర్స్ ఎన్‌సిపివో ఈఈఈ) ఉపాధ్యక్షులు, టిఎస్‌పిఈఏ అధ్యక్షుడు ఏ. రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ చట్టం 2021ను అమలు చేయడం లేదని చెబుతూనే మరో వైపు రాష్ట్రంలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. లాభాలు ఉన్న చండీఘర్, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలలో విద్యుత్‌శాఖను ప్రవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అక్కడి ఉద్యోగులు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపుడుతున్నామన్నారు. ఎన్‌సిపీవోఈఈఈ పిలుపు మేరకు మంగవారం ఎస్‌పిడిసీఎల్ కేంద్ర కార్యలయం ముందు టిఎస్‌ఎప్‌పిఈఈఏసి ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దర్నా నిర్వహించారు.

చండీఘర్‌లో విద్యుత్ సంస్థలు ఈ ఆర్దిక సంవత్సరంలో రూ.260 కోట్లు గడించాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తూ ప్రవేట్ వ్యక్తులకు లాభాలు గడించి పెట్టడానికి విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. చండీఘర్‌లో విద్యుత్ వినియోగదారులు కూడా అక్కడి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. పాండిచ్చేరిలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే వారిపై అక్కడి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలని చూస్తుందని, పరిస్థితి అంతవరకు వస్తే దేశవ్యాప్త సమ్మెకు మనం అందరం సిద్దం కావాలని సూచించారు.

కార్పోరేట్ సంస్థలకు లాభాలు గడించి పెట్టడానికి లాభాల్లో ఉ న్న వాటిని అప్పగించే కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మెరుపు సమ్మెకు వెనుకాడవద్దని, అందుకు విద్యుత్ ఉద్యోగులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరకేంగా ఉన్నందున మనకు ఎటువంటి ఇబ్బంది లేదని కాని కేంద్రం కుట్రలు చేస్తే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌పిఈఏ కార్యదర్శి పి. సదానందం, జేఏసీ నాయకులు సాయిబాబు, వేణుగోపాల్, వేణు, శంకర్,భాను ప్రసాద్, ఈశ్వర్‌గౌడ్, గోపాల్, వెంకటనారాయణ రెడ్డి, శివశంకర్ ,గోపాల కృష్ణ, బాగయ్య కిషోర్, సురేష్ ,లక్ష్మీ ప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News