- Advertisement -
తెలంగాణపై కుండపోతగా వర్షం కురిసింది.పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.సోమవారం మధ్యా హ్నం కురిసిన భారీ వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు రోడ్లపైనే నరకం చవిచూశారు. ఏకధాటిగా గంటన్నరకు పైగానే వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 2 గంటల పాటు నాన్ స్టాప్ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు వర్షపునీటితో మునకేసి చెరువులను తలపించాయి. ఇక పంజాగుట్టలోని సుఖ్ నివాస్ అపార్టు మెంట్ వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయ్యింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా జిహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
- Advertisement -