Monday, December 23, 2024

పిడుగు పడి ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట:రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. దుబ్బాక మండలంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పద్మశాలి గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లేంగడ్డ గ్రామంలో రోడ్డు పైన ఉన్న వడ్లు తడవకుండా కవర్ కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో సౌడు పోచయ్య(65) అక్కడికక్కడే మరణించాడు. పక్కనే ఉన్న రెడ్డబోయిన కొండయ్య(60) అనే వృద్దుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గాయపడిన కొండయ్యను 108 అంబులెన్స్ లో దుబ్బాక ఆసుపత్రికి తరలించారు.

Lightning Strike Kill Farmer in Dubbaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News