Monday, December 23, 2024

పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు ః వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం గొర్రెలను మేపుకోవడానికి వంగూరు లక్ష్మి(38) భర్త పాటు వంగూరు బాలయ్యతో కలిసి పంట పొలానికి గొర్రెలను మేపుతుంగా మధ్యాహ్న సమయంలో పిడుగు పాటుకు గురైంది.

అదే సమయంలో సమీపంలో ఉన్న మృతురాలి భర్త బాలయ్యతో పాటు కొడుడు సందీప్ కూడా అక్కడే ఉన్నారు. ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా చూస్తుండగానే పిడుగు పాటుకు గురై వంగూరు లక్ష్మిఅక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి సొంత నివాసం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామం. ఈ సంఘటన రెండు గ్రామాలలో విషాదం నింపింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News