జకార్తా: ఫుట్‌బాల్ మైదానంలో ఆడుతుండగా ఆటగాడిపై పిడుగుపడడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిలివాండి ఫుట్‌బాల్ స్టేడియంలో శనివారం సాయంత్రం స్నేహపూర్వక మ్యాచ్ జరుగుతోంది. ఫుట్‌బాల్‌ను గోల్ కీపర్ వైపు తీసుకెళ్తుండగా ఆటగాడిపై పిడుగుపడింది. వెంటనే తోటి క్రీడాకారులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మైదానంలో విషాద వాతావరణం నెలకొంది. గతంలో జావాలోని బోజోనెగోరోలో అండర్ -13 టోర్నమెంట్ జరుగుతుండగా బాలుడిపై పిడుగుపడడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
Footballer (soccer) dead after being struck by lightning during a match in Indonesia⚡️
⭕️The man, later identified as Septain Raharja(35), was competing in a friendly football match between 2 FLO FC Bandung and FBI Subang, when lightning struck him at around 4:20pm local time on… pic.twitter.com/rAzB0rHCVi
— Global Dissident (@GlobalDiss) February 12, 2024