Friday, January 24, 2025

తొలి సోలార్‌ పవర్‌ కారు ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -
First Solar Car

dash board

నెదర్లాండ్స్‌కి చెందిన డచ్ కంపెనీ సోలార్‌ కారుకి రూపకల్పన చేసింది. సరికొత్తగా డిజైన్‌ చేసిన ఈ సోలార్‌ కారు పైసా ఖర్చు లేకుండా అదనపు మైలేజీని అందిస్తుంది. ఈ కారుకి ‘లైట్‌ఇయర్‌ జీరో’గా పేరు పెట్టారు. ఈ కారు చార్జీంగ్ లేకుండా నెలల తరబడి నడుస్తుంది. 

 

ఆమ్ స్టర్ డ్యామ్:  ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి అదనపు మైలేజీ అందివ్వడం ద్వారా,  ఛార్జింగ్‌ స్టేషన్లపై ఆధారపడే అవకాశం తగ్గించాలనే కాన్సెప్టుతో ఈ సోలార్‌ ఎలక్ట్రిక్‌ కారుని డిజైన్‌ చేసింది నెదర్లాండ్ కు చెందిన కంపెనీ. ‘లైట్‌ ఇయర్‌ జీరో’ కారు అనేది స్వతహాగా ఎలక్ట్రిక్‌ కారు. 60 కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది. సింగిల్‌ ఛార్జ్‌తో 625 కి.మీ మైలేజీ అందిస్తుంది. పది సెకన్లలో వంద కి.మీ  వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 160 కి.మీలు. అయితే అన్ని ఈవీ కార్లకు ఉండే ఛార్జింగ్‌ సమస్యను అధిగమించేందుకు దీనికి సోలార్‌ పవర్‌ను జత చేశారు. గత ఆరేళ్లుగా ఈ కాన్సెప్టుపై పని చేయగా, తొలి కారుకి ఇప్పుడు తుది రూపం వచ్చింది.

లైట్‌ ఇయర్‌ జీరో కారు ధరను 25000 డాలర్లుగా నిర్ణయించారు. తొలి ఏడాది 974 యూనిట్ల కార్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి యూరప్‌ మార్కెట్‌లో సింహభాగం తామే ఆక్రమిస్తామని లైట్‌ ఇయర్‌ జీరో మేకర్స్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

‘లైట్‌ఇయర్అ జీరో’ అనేది 5 చదరపు మీ (53.8 చదరపు అడుగులు) సౌర ఫలకాలున్న, రోజుకు 70 కి.మీ (44 మైళ్లు) వరకు ఛార్జ్-ఫ్రీ డ్రైవింగ్‌కు అనుకూలమైన  కుటుంబ ‘సెడాన్’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News