Thursday, January 23, 2025

కులగణన లేకుండా ఉపకులాల రిజర్వేషన్‌లా!

- Advertisement -
- Advertisement -

ఆధిపత్య కులాలను చేర్చడం లేదా రిజర్వేషన్ ప్రయోజనాల నుండి అర్హులైన కులాలను మినహాయించడం వంటి వివరాలు కూడా ఖచ్చితమైన డేటా అందుబా టులో ఉన్నట్లయితే మాత్రమే నిర్ధారించబడతాయి. ఈ నేపథ్యంలోనే కులనిర్మూలన దృక్పథాన్ని సమర్థించే ప్రజాస్వామిక శక్తులన్నీ అఖిల భారత కుల గణనను గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా వారీగా కుల డేటా ఆధారంగా రిజర్వేషన్ల విస్తరణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కులగణన జరిపినట్లయితే కుల గణన డేటాను ఏర్పాటు చేసినట్లయితే మనువాద బ్రాహ్మణ, ఫాసిస్ట్ శక్తులు భారత, రాష్ట్ర పగ్గాలను నియంత్రించడానికి భయపడుతున్నారు. అందువల్ల వారు అఖిల భారత కులగణనను సామాజిక సామరస్యాన్ని నాశనం చేస్తుందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అత్యంత అణగారిన కులసమూహాలు భరిస్తున్న చారిత్రక అన్యాయాలను తొలగించే సాధనంగా భారతదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ మొత్తం మార్గం (పథం) అనేక సామాజిక, -రాజకీయ, చట్టపరమైన సవాళ్లతో చుట్టుముట్టబడింది. నేడు మన ముందున్నటువంటి కీలకమైన ముఖ్య అంశం ఏమిటంటే మనుస్మృతిచే ఉపమానవులుగా భావించబడిన ‘అంటరాని’ షెడ్యూల్డ్ కులం (ఎస్‌సి) లేదా ‘దళితులు’లోని ఉప-కుల సమూహాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల అసమాన పంపిణీ గురించి నేడు చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించి, కొన్ని రాష్ట్ర శాసన సభలు ఉపకులాల ఆధారంగా రిజర్వేషన్ కోసం చట్టాలను రూపొందించినప్పటికీ, 2009 నుండి ఉపకుల రిజర్వేషన్లు అమలులో మాత్రం దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే అత్యంత విజయవంతమైనది. మరోవైపు, కర్ణాటకలో ఉపకులాల రిజర్వేషన్‌పై 2012లో సదాశివ కమిషన్ తన నివేదికను సమర్పించింది.

కానీ కర్ణాటకలోని వరుసగా వచ్చిన ప్రభుత్వాలు అది సిఫార్సు చేసిన షెడ్యూల్డ్ కులాల అంతర్గత కోటాను అమలు చేయలేకపోయాయి. అయితే అఖిల భారతస్థాయిలో ఉపకుల సమూహాల మధ్య రిజర్వేషన్ల అసమాన పంపిణీతో సహా కులాంతర అసమానతలు, అసమానతలకు సంబంధించి సమగ్రమైన, ఖచ్చితమైన డేటా ఇప్పటికీ లేదు. అటువంటి డేటా గనుక ఉన్నట్లయితే షెడ్యూల్డ్ కులములు/ షెడ్యూల్డ్ తెగలులోని అత్యంత వెనుకబడిన, అట్టడుగు వర్గాలను గుర్తించడంలో, వారి సమర్థవంతమైన అభ్యున్నతికి సంబంధించిన విధానాలను రూపొందించడంలో కూడా సహాయపడుతుంది. ఆధిపత్య కులాలను చేర్చడం లేదా రిజర్వేషన్ ప్రయోజనాల నుండి అర్హులైన కులాలను మినహాయించడం వంటి వివరాలు కూడా ఖచ్చితమైన డేటా అందుబాటులో ఉన్నట్లయితే మాత్రమే నిర్ధారించబడతాయి. ఈనేపథ్యంలోనే కులనిర్మూలన దృక్పథాన్ని సమర్థించే ప్రజాస్వామిక శక్తులన్నీ అఖిల భారత కుల గణనను గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభావారీగా కుల డేటా ఆధారంగా రిజర్వేషన్ల విస్తరణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

కులగణన జరిపినట్లయితే కుల గణన డేటాను ఏర్పాటు చేసినట్లయితే మనువాద బ్రాహ్మణ, ఫాసిస్ట్ శక్తులు భారత, రాష్ట్ర పగ్గాలను నియంత్రించడానికి భయపడుతున్నారు. అందువల్ల వారు అఖిల భారత కుల గణనను సామాజిక సామరస్యాన్ని నాశనం చేస్తుందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కుల నిర్మూలన దిశలో మొదటి అడుగువేయాలనే దానికి కుల గణన అనివార్యమైన చర్య. కులం నిర్దిష్ట వాస్తవికతను గుర్తించడానికి కులగణన ప్రధానంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌సి, ఎస్‌టిలకు ఉపకుల రిజర్వేషన్లపై ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆగస్టు 2వ తేదీ ఇచ్చిన తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. కులాంతర అసమానతలను నిర్ణయించడానికి మొదటి అడుగు అయిన అనివార్యమైన, విశ్వసనీయమైన కులగణన ఆవశ్యకత గురించి ఈ తీర్పు అసలు ప్రస్తావించలేదు. తమ పరిశీలనలో ‘ఉప-కులం’ తీర్పులో భాగమైన న్యాయమూర్తులు కూడా కట్టుబడి ఉండకపోయినా, షెడ్యూల్డ్ కులాల వర్గానికి కూడా ‘క్రీమీలేయర్’ అజెండాను విస్తరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారని వెల్లడించారు.

తీర్పులో భాగమైన జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రత్యేకించి రిజర్వేషన్ ప్రయోజనాల నుండి వారిని పూర్తిగా మినహాయించడానికి ‘ఎస్‌సిలు, ఎస్‌టిలలో క్రీమీలేయర్‌ని గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్థికస్థితి మార్పు అనేది అంటరానితనం, కుల అణచివేతను మార్చదు అనే అవగాహనను ఇది ఘోరంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఒకవైపు క్రీమీలేయర్, ఆర్థికంగా బలహీన వర్గాల (ఇడబ్ల్యు ఎస్) రిజర్వేషన్‌లు రెండింటినీ సమర్థిస్తూ అదే సమయం లో షెడ్యూల్డ్ కులం/ షెడ్యూల్డ్ తెగలులో ఉపకులాల రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు నిలబడిన హిందుత్వ ఫాసిస్ట్ శక్తుల మొత్తం వర్ణపటం కూడా ఇదే దృక్పథాన్ని పంచుకుంటుంది.

సిపిఐ(ఎం)వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన కమ్యూనిస్టులు కులానికి సంబంధించిన యాంత్రిక విధానం కూడా ఉపకుల రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టు తీర్పుకు తక్షణమే మద్దతు ఇవ్వడం ద్వారా స్పష్టమవుతుంది. కాబట్టి ఒకవైపు సుప్రీం కోర్టు ఉపకుల తీర్పును సమర్థిస్తూ, మరొక వైపు వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణీయ శక్తులు, వారి మిత్రపక్షాల ద్వంద్వ ఆటను అన్ని కుల వ్యతిరేక ప్రజాతంత్ర శక్తులు చూడాల్సిన సమయం ఆసన్నమైంది. కులగణన ద్వారా కులానికి సంబంధించిన నిర్దిష్టమైన, సాక్ష్యం- ఆధారిత డేటాను సేకరించడం, బహిరంగంగా విడుదల చేయడంపై వారికి అయిష్టత. ఈ చర్య ద్వారా బ్రాహ్మణ పాలక వర్గాల ఉద్దేశం ఎస్‌సి/ ఎస్‌టి రిజర్వేషన్‌లను పలుచన చేయడం, అయోమయాన్ని నాటడం, అంటరాని, అణగారిన కులాల మధ్య అనైక్యతను బలోపేతం చేయడం దీన్ని ముఖ్య ఉద్దేశం. ఇది అత్యంత అణగారిన వర్గాలను మోసం చేయడం కోసమే ఉద్దేశించినది.

కొల్లిపర వెంకటేశ్వరరావు
82477 28296

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News