Wednesday, January 22, 2025

నవంబర్ 4న ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’

- Advertisement -
- Advertisement -

https://www.manatelangana.news/buying-a-plot-better-than-an-apartment-g-square-ceo/

దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరో సంతోష్ శోభన్‌ల తాజా చిత్రం ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ “మేర్లపాక గాంధీ ఇచ్చిన కథతో ‘ఎక్ మినీ కథ’ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం అనందంగా వుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేర్లపాక గాంధీ, ఫరియా అబ్దుల్లా, వెంకట్ బోయనపల్లి, బ్రహ్మజీ తదితరులు పాల్గొన్నారు.

Like Share & Subscribe Movie release on Nov 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News