Wednesday, January 22, 2025

పాలమూరుకు లైన్‌క్లియర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ జిల్లాలకు వరప్రదాయని అయిన పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలకు అ డ్డంకులు తొలగిపోయాయి. దక్షిణ తెలంగాణ ప్రజలకు కృష్ణానదీ జల వివాదాల ట్రిబ్యునల్-2 (జస్టిస్ బ్రజేష్ కు మార్ ట్రిబ్యునల్) తీపి కబురందించింది. పాలమూరు ప్రా జెక్టుకు 90 టిఎంసిల నీటిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 246 జిఒపై కృష్ణా ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్లను,కేసును కొట్టివేసింది. ఈ అంశం తమ పరిధిలో లేదని, స రైన ఫోరంలలో తేల్చుకోవాలని కేసును కొట్టివేసింది. కేం ద్ర జల సంఘం (సిడబ్లుసి) ఇప్పటి వరకూ పాలమూరు-రంగారెడ్డి డిపిఆర్‌ను పరిశీలిస్తే కేసు కోర్టులో ఉంది గనుక కోర్టు ధిక్కరణ అవుతుందనే ఉద్దేశ్యంతో ప్రాజెక్టు రిపోర్టు ను పరిశీలించకుండా పెండింగ్‌లో పెట్టిందని, ఇప్పుడు అదే కేసును ట్రిబ్యునల్ కొట్టివేయడంతో డిపిఆర్ పరిశీ లనకు ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయినట్లేనని అధి కారులు వివరించారు.

ఇక సిడబ్లుసి కూడా ఎలాంటి సా కులు చెప్పకుండా డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)కు క్లి యరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుందని ఆశి స్తున్నామని ఆ అధికారులు తెలిపారు. పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, పర్యావరణం, మోటా, కేంద్ర భూగర్భ జల శాఖ, కేంద్ర విద్యుత్తు ప్రాధికార సం స్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్‌ల నుంచి ప్రాజెక్టు నిర్మాణాలకు అవసరమైన క్లియరెన్స్‌లు వచ్చాయని ఆ అధికారులు వివరించారు. ఇక అత్యంత కీలకమైన సిడ బ్లుసి క్లియరెన్స్ వచ్చిందంటే ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణాలను యుద్దప్రాతిపదికన చేప ట్టవచ్చునని అంటున్నారు. ఇక పాలమూరు ప్రాజెక్టు ని ర్మాణాలు వాయువేగంగా జరుగుతాయని, వచ్చే వానాకా లం సీజన్‌నాటికి మరో రెండు పంప్‌లను కూడా సిద్ధం చేయగలుగుతామని కొందరు సీనియర్ ఇంజనీరింగ్ అధి కారులు సంతోషంతో వ్యాఖ్యానించారు. కృష్ణానదీ జలాల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుక్కెదు రైంది.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్టు ప్రాజెక్టు పరిథిలోని మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల ప్రజల తాగునీరు, సా గునీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. ఈ ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో నెలకొన్న  కరువు పరిస్థితులను పారద్రోలడానికి ఉద్దేశించిన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) స్టేతో ఏకంగా ఐదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణాల్లో అంతులేని జాప్యం జరిగిందని, ఇటీవలనే స్టే ఎత్తివేయడం, ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంతో ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజన్సీలు రేయింబవళ్ళూ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తున్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఫలాలను ఆయకట్టులోని 1226 గ్రామాల ప్రజలకు తాగునీరు, సాగునీటి వసతులను కల్పించేందుకు కృష్ణానదీ జలాలను తరలించేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఇటీవలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నార్లాపూర్ పంప్‌మౌస్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంతేగాక ఏకంగా 60 ఏళ్లుగా నిరీక్షిస్తున్న కరువు ప్రాంతాలప్రజలకు ఈ ప్రాజెక్టు నుంచి తాగునీరు, సాగునీటిని అందించి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో కృష్ణానదీ జలాల కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంతోనూ పోరాడుతూనే ఉంది. అంతేగాక ఎపి ప్రభుత్వ కేసును జస్టిస్ బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొట్టివేయడాన్ని ఈ పోరాటంలో తొలి విజయంలో భాగంగా పరిగణించాల్సి ఉంటుందని ఆ అధికారులు వ్యాఖ్యానించారు.

ఇది పాలమూరు విజయంః మంత్రి నిరంజన్‌రెడ్డి
కృష్ణానదీ జల వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన జస్టిస్ బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ బుధవారంనాడు ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన కేసును కొట్టివేయడం పాలమూరు ప్రజల విజయమని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌రెడ్డి అభివర్ణించారు. దీంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినట్లేనని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి కరువు ప్రాంత ప్రజలను ఆదుకునే ప్రాజెక్టుగా గుర్తించి జాతీయహోదాను ప్రకటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదల, నిరంతరం ఈ ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడానికి ఆయన చేసిన తపస్సు ఫలించిందని మంత్రి పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన కేసు మూలంగా ఇప్పటి వరకూ కేంద్ర జల సంఘం క్లియరెన్స్‌లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిందని, ఇప్పుడు ఆ అడ్డంకి కూడా తొలగిపోయినందున ప్రాజెక్టు డిపిఆర్‌కు వెంటనే క్లియరెన్స్‌లు ఇవ్వాలని మంత్రి కోరారు. అంతేగాక కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News