Wednesday, November 13, 2024

ఎసిబి వలలో లైన్‌మెన్

- Advertisement -
- Advertisement -

Line men arrested by ACB

మనతెలంగాణ/హైదరాబాద్ : కొండాపుర్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న సోనబోయిన శ్రీనివాసరావు రూ. 15వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం నాడు ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మైలారపు శివకుమార్‌రెడ్డి కోండాపుర్ మసిద్ బండలో మిటర్ కనెక్షన్, ప్యానల్ బోర్డ్ తరలింపు నిమిత్తం లైన్‌మెన్ శ్రీనివాసరావును కలిశాడు. దీంతో ప్యానల్ బోర్డ్ షిఫ్టింగ్‌కు రూ. 20 వేలు లంచం ఇవ్వాలని లైన్‌మెన్ శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు.

ఈ క్రమంలో రూ. 20వేల లంచం మొత్తంలో రూ. 5 వేలు లైన్‌మెన్ శ్రీనివాస్‌కు తొలివిడతగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ శివకుమార్‌రెడ్డి ఇచ్చాడు. మిగిలిన రూ.15 వేలు పని పూర్తికాగానే ఇస్తానని చెప్పాడు. అనంతరం తనను లంచం డిమాండ్ చేసిన లైన్‌మెన్ శ్రీనివాసరావుపై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రూ.15వేలు లంచం తీసుకుంటున్న లైన్‌మెన్‌ను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అతని చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం లైన్‌మెన్‌ను అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఎసిబి కోర్టు లంచం కేసులో పట్టుబడిన శ్రీనివాసరావుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News