Thursday, January 23, 2025

బిల్లు చెల్లించాలని అడిగినందుకు లైన్‌మెన్‌పై దాడి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: విద్యుత్ బిల్లు చెల్లించాలని కోరిన విద్యుత్ శాఖ లైన్‌మెన్‌పై దాడికి పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆజామాబాద్ డివిజన్‌లో లైన్‌మెన్‌గా పనిచేసే భాస్కర్ సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జమిస్తాన్‌పూర్ లోని 1..6..883 ఇంటి నంబరు వద్ద బిల్లు చెల్లించాలని కోరారు. ఈ సమయంలో ఇంటి యాజమానికి చెందిన మహమ్మద్ అహ్మద్, మహమ్మద్ గౌసుద్దీన్‌లు లైన్‌మెన్‌పై భాస్కర్‌పై దాడి చేసి విపరీతంగా కొట్టి, దుర్భాషలాడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు భాస్కర్ కోరారు. ముషీరా బాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రసాద రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News