హైదరాబాద్: విద్యుత్ మీటర్ బిగించేందుకు లంచం తీసుకుంటూ విద్యుత్ లైన్‌మెన్ బుధవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మలక్‌పేట, నల్గొండ క్రాస్ రోడ్డుకు చెందిన రహమాన్ అనే వ్యాపారి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ప్లాంట్‌లో మీటర్ బిగించేందుకు సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ లైన్‌మెన్ నర్సింహులును సంప్రదించాడు. మీటర్ బిగించేందుకు రహమాన్‌ను లైన్‌మెన్ నర్సింహులు రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. అంత డబ్బులు తన వద్ద లేవని, ఇవ్వలేనని చెప్పాడు. అయినా లైన్‌మెన్ వినకుండా నాలుగు రోజుల ఉంచి ఇబ్బందులు పెడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం రూ.3,000 ఇచ్చాడు. తర్వాత మరో రూ.8,000 ఇస్తానని చెప్పాడు. రహమాన్ ఎసిబి అధికారులను సంప్రదించి విషయం చెప్పాడు. ఎసిబి అధికారుల సూచనమేరకు మిగతా డబ్బులు ఇస్తుండగా లైన్‌మెన్ పట్టి నర్సింహులు, కుమ్మరి హరికృష్ణ అలియాస్ హరిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఎసిబి అధికారులు ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితులను రిమాండ్‌కు తరలించింది.
ఎసిబి వలలో లైన్‌మెన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -