Wednesday, January 22, 2025

గొర్లు కాచుకునే నాకే రాజ్యసభ ఎంపి ఇచ్చారు: లింగయ్య

- Advertisement -
- Advertisement -

Badugula lingaiah yadav comments on Modi govt

హైదరాబాద్: మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ కు సిఎం కెసిఆర్ వల్లే రాజకీయంగా గుర్తింపు వచ్చిందని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. టిఆర్ఎస్ వి కార్యాలయం నుంచి లింగయ్య యాదవ్ మాట్లాడారు. 2014, 2019 లో ఎంపిగా బూర నర్సయ్యకు టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్నారు. 2019లో ఎంపిగా ఓడిపోయినా బూరకు కెసిఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని, తమ కంటే ఎక్కువగా బూర కెసిఆర్ ను కలిశారని, ఇటీవల సిఎం కెసిఆర్ యాదాద్రిలో పర్యటించినప్పుడు బూరకు అన్నింటా ప్రాధాన్యత లభించిందన్నారు. వెనక బడిన వర్గాలకు టిఆర్ఎస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని బూర చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని లింగయ్య మండిపడ్డారు.

రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బిసిలకు కెసిఆర్ అవకాశం ఇచ్చారని, గొర్లు కాచుకునే తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారని, ఇది బిసిలకు గౌరవం లభించినట్టు కాదా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బిసిలకు లభించని గౌరవం ఈ ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనలో లభించిందన్నారు. గురుకులాల సంఖ్య పెంచి కెసిఆర్ బిసిలకు విద్యావకాశాలు పెంచారని, చేతి వృత్తులకు ఆదరణ పెంచింది కెసిఆరేనని, గీత నేతన్నలకు కెసిఆర్ హయాంలో కొత్త పథకాలు వచ్చాయన్నారు. బిజెసి కుట్రలో పావుగా మారి కెసిఆర్ ను విమర్శించొద్దని బూరకు లింగయ్య సూచించారు.  బిజెపిలో బూరను ఎవరు పట్టించుకోవడం లేదని, బిజెపిలో బండి సంజయ్ కే దిక్కు లేదని, బూరను ఎవ్వరు పట్టించుకుంటారని లింగయ్య ఎద్దేవా చేశారు. బిసిలు మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ వెంటే ఉన్నారని, బిజెపి అహంకారాన్ని ఓడిస్తారని జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News