Sunday, January 19, 2025

నా ముందే తలదువ్వుతావా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఎస్‌ఐ వ్యవహారశైలి ఓ యువకుడి ప్రాణాల మీదికి వ చ్చింది. పెట్రోల్ బంకులో జరిగిన చిన్నపాటి గొడవలో ముగ్గురు యువకులకు శిరోముండనం చే యించడం, అవమానం భరించలేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం చ ర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీన ముగ్గురు యువకులు తమ ద్విచక్ర వాహనంలో రూ.20 పె ట్రోల్ పోయాలని బంక్ నిర్వాహకులను కోరారు. ఇందుకు నిర్వాహకులు నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. ఎస్‌ఐ జగన్‌మోహన్ రావు ఆ ముగ్గురు యువకులతో పెట్రోల్ బంక్‌లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతుండగా ఒక యువకుడు చేతితో తన తలను దువ్వాడు.

తన ఎదుటే తల దువ్వాడన్న అహంకారంతో ఆ ముగ్గురు యువకులకు ఎస్‌ఐ శిరోముండనం చేయించారు. ఇదిలాఉండగా శిరోముండనానికి గురైన వారిలో గోపిశెట్టి వినీత్ అనే యువకుడు గ్రామంలోకి వెళ్లగా కొందరు శిరోముండనంపై ఎగతాళి చేసి మాట్లాడారు. దీంతో ఆ యువకుడు ఇంటికి వచ్చి పోలీసులు తనకు శిరోముండనం చేయిస్తే ఎందుకు అడగలేదు నాన్నా అని తన తండ్రి సుధాకర్‌ను నిలదీసినట్లు బాధితుడి తల్లి హేమలత తెలిపింది. తనకు అవమానం జరిగిందని భావించిన ఆ యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఎస్‌ఐ జగన్మోహన్‌రావు దగ్గరుండి శిరోముండనం చేయించారా..? వారి కుటుంబ సభ్యులకు చెప్పి వారి ద్వారా చేయించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో వారి కుటుంబ సభ్యులు మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులే ఆ యువకులకు శిరోముండనం చేయించారనే వాదనలకు బలం చేకూరుతోంది.

ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతుండగా మరో ఇద్దరు యువకులు గ్రామం వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ముగ్గురిలో ఏ ఒక్కరైనా ముందుకువచ్చి తమకు జరిగిన శిరోముండనం వ్యవహారం చెబితే వాస్తవాలు బహిర్గతమవుతాయి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినీత్ తల్లి హేమలత తెలిపిన మేరకు పోలీసులు యువకులను అవమానించే విధంగా శిరోముండనం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే తప్ప పోలీసుల పాత్ర ఉందా లేదా అనే అంశాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పలువురు మీడియా ప్రతినిధులు ఈ విషయమై ఎస్‌పిని వివరణ కోరగా, లింగాల ఎస్‌ఐ నాలుగు రోజులుగా సెలవుపై ఉన్నారని, పెట్రోల్ బంక్ నిర్వాహకులు, యువకుల మధ్య గొడవ జరిగినట్లు తమకు సమాచారం ఉందని, శిరోముండనం ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News