Saturday, November 9, 2024

బిజెపి ఓటమికి కారణమైన యడియూరప్ప

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి నుంచి విడిపోయిన యడియూరప్ప కర్ణాటక జనతా పక్ష (కెజిపి)పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. కానీ 2013 ఎన్నికల్లో కెజిపి కేవలం 6సీట్లు మాత్రమే గెలిచింది. అయితే 10శాతం ఓట్ల షేరును సాధించి బిజెపి ఓటమికి యడియూరప్ప కారణమయ్యారు. అనంతరం యడియూరప్ప 2014 లోక్‌సభ ఎన్నికలు ముందు మోడీ సారథ్యంలో మళ్లీ బిజెపిలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచింది. లింగాయత్ ఐకాన్ యడియూరప్ప మరోసారి ప్రమాణం చేశారు. 2021లో యడియూరప్ప సిఎం పదవి నుంచి వయస్సును కారణంగా చూపుతూ వైదొలిగినప్పుడు బిజెపి మరో లింగాయత్ బసవరాజ్ బొమ్మైను ఆయన స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంది.

ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు యడియూరప్ప ఇటీవల ప్రకటించినా లింగాయత్ మద్దతు చెక్కుచెదరకుండా ఉండేందుకు ఆయన ప్రచార సారథిగా హూగస్థానంలో బిజెపి నిలబెట్టింది. మరోవైపు లింగాయత్ దిగ్గజాన్ని బిజెపి పక్కనపెట్టిందని ప్రచారం చేయడం ద్వారా వారి మద్దతును కూడగట్టేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. లింగాయత్ కమ్యూనిటీలోని ఓ వర్గం రిజర్వేషన్ డిమాండ్‌కు అంగీకరించి కోటాను 2శాతం పెంచింది. అయితే లింగాయత్ కమ్యూనిటీకి ‘మత మైనారిటీ’ హోదా కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2018అసెంబ్లీ ఎన్నికల్లో హస్తంపార్టీకి నష్టాన్ని కలిగించింది. లింగాయత్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తోపాటు ప్రత్యేక లింగాయత్ మతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నేతలు ఓటమిపాలయ్యారు.

లింగాయత్‌లను మైనారిటీ వర్గంగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ఆ సమాజాన్ని విభజించిందనే బిజెపి ప్రచారం చేయడంతో లింగాయత్‌లు కమలంపార్టీవైపు మొగ్గు చూపారు. వీరశైవులు, లింగాయత్‌లను ఒకటేలా చూపడంపై ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అఖిల భారత వీరశైవ మహాసభ నేతృత్వంలోని ఓ వర్గం వీరశైవ, లింగాయత్‌లు ఒకటే అని పేర్కొంటూ ప్రత్యేక మత హోదాను డిమాండ్ చేయగా మరో వర్గం భాగమైన ఏడుశాఖల్లో వీరశైవమూ ఒకటే అని విశ్వసించి లింగాయత్‌లకు మాత్రమే హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా వీరశైవులను హిందూమతంలో భాగంగా పేర్కొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News