Monday, December 23, 2024

కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Lingayat Seer Found Dead At Ramanagara Mutt

బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని లేఖలో వెల్లడి

బెంగళూరు : కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామనగర్ జిల్లా మగాడి తాలూకా కెంపుపురా గ్రామం లోని శ్రీ కంచుగల్ మఠానికి చెందిన 45 ఏళ్ల బసవలింగ స్వామి సోమవారం ఉదయం శవమై కనిపించారు. ఆశ్రమం ఆవరణ లోని పూజా గది కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచే స్వామి 6 గంటల వరకు లేవకపోవడం, పూజ గది తలుపులు మాసి ఉండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా, సాధువు మరణం బయటపడింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కంచుగల్ మఠానికి 1997లో ప్రధాన పీఠాధిపతిగా బసవలింగ స్వామి నియామకమయ్యారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. కొన్ని నెలల క్రితం రజతోత్సవాన్ని జరుపుకున్నారు.

స్వామీజీ వద్ద రెండు పేజీల సుసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనను మఠాధిపతి నుంచి తొలగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్న వారి పేర్లు కూడా ఆ నోట్‌లో స్వామీజీ రాసినట్టు నమాచారం. అయితే బ్లాక్‌మెయిల్ కారణం గానే మఠాధిపతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం బెల్గాం లోని శ్రీగరు మడివళేశ్వర మఠం లోని బసవ సిద్ధలింగస్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు రావడంతో స్వామీజీ కలత చెంది ఉంటారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News