Wednesday, January 22, 2025

వీరశైవ లింగాయతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisement -
- Advertisement -
భారత రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ఆ సంఘం ప్రతినిధి బృందం

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నామని, వీరు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు జీవన విధానాలను, స్థితిగతులను భారత రాష్ట్రపతి వివరించినట్లు తెలిపారు.

తెలంగాణలో వీరశైవ లింగాయతులు లింగ బలిజలు 90 శాతం మంది కడు బీదరికంలో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరశైవ లింగాయత్లకు, లింగ బలిజలకు ప్రత్యేకంగా ఎలాంటి వృత్తి లేదని చిరు వ్యాపారాలు చేసుకుంటూ, కాయగూరలు, పాలు పెరుగు అమ్ముకుంటూ, వ్యవసాయ కూలీలుగా, కంపెనీలలో కూలీలుగా, తోపుడుబండ్లపై వ్యాపారం చేస్తూ, చిన్న చిన్న హోటల్స్ నడుపుతూ జీవన ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో, ప్రభుత్వ పథకాలలో చాలా నష్టం జరుగుతుందని కేంద్రం ఓబిసిలో చేర్చకపోవడంతో డాక్టర్లు కావలసిన విద్యార్థులు ఎంబిబిఎస్ సీట్లలో,ఇంజనీర్లు కావలసినవారు ఐఐటీలలో ఇంజనీరు సీట్లలో విద్యా అవకాశాలను కోల్పోతున్నారని వెల్లడించారు. జాతీయ బిసి కమిషన్ వీరశైవ లింగాయత్, లింగ బలిజలను నేషనల్ ఓబిసి కమిషన్ లిస్టులో చేర్చుటకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చిన అమలు చేయలేదన్నారు.

రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి శివకుమార్, రాష్ట్ర కోశాధికారి జి దినేష్ పాటిల్, రాష్ట్ర యువజన అధ్యక్షులు కల్లేపల్లి రాచప్ప, కేంద్ర కమిటీ చైర్మన్ మాజీ ఉప లోకాయుక్త ఎం శివరత్న, అడ్వైజర్ కల్వ మల్లికార్జునప్ప, సభ్యులు డాక్టర్ కోటి శివప్ప, రాష్ట్ర ప్రతినిధులు కర్నే రాజశేఖర్, ఆవిటి మధుసూదన్, మిరియాల అనిల్ కుమార్, కే సోమేశ్వర్, తదితరులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి శ్రీ మహాత్మా బసవేశ్వరుని చిత్రపటాన్ని, మహాత్మా బసవేశ్వరాది శివశరణులు బోధించిన ‘వచనము‘ అనే పుస్తకము ఒరియా భాషలో ముద్రితమైన సంపుటిని బహుకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News