జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో మలయాళ సూపర్ హిట్ నాయాట్టు మూవీకి రీమేక్ గా ‘కోట బొమ్మాళి పిఎస్’ పేరుతో తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇందులోని మొదటి పాటను విడుదల చేశారు. లింగి లింగి లింగిడి… అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు ‘రేలారే’ ఫేమ్ పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందరినీ ఆకర్షిస్తుంది. ముకుందన్ పాటను కంపోజ్ చేయగా విజయ్ పోలకి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. కలర్‌ఫుల్ సెట్లో రాహుల్ విజయ్, శివానితో కలిసి శ్రీకాంత్ చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ శ్రీలీల విడుదల చేసిన ఈ పాటకు యూత్‌లో మంచి క్రేజ్ వస్తోంది.