Sunday, January 19, 2025

తెలుగోడి జానపదం దమ్ము ఇది

- Advertisement -
- Advertisement -

జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా ‘కోట బొమ్మాళి పిఎస్’. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన శ్రీకాకుళం మాస్ సెన్సేషనల్ సాంగ్ ‘లింగి లింగి లింగిడి‘ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతోంది. పి.రఘు సాహిత్యం అందించడంతోపాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ పాటతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ “ఒక పాట హిట్ అయితే సక్సెస్ మీట్ చేయడం మాకు తెలిసింది ఫస్ట్ టైం అనుకుంటా. ఈ సాంగ్ ఎలా ఉందంటే సోషల్ మీడియాలో 5000 రూల్స్ తో ట్రెండింగ్ లో ఉంది.14 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ న్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగోడి జానపదం దమ్ము ఇది”అని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ “చాలాకాలం తర్వాత ఇంత మంచి సినిమా చేశానని ఫీల్ ఉంది. ఇలాంటి సినిమా జీఏ2 పిక్చర్స్ తప్ప ఎవరూ చెయ్యరు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, తేజ మార్ని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News