Thursday, January 23, 2025

‘లింగోచ్చా’ అంతే ఫ్యామస్

- Advertisement -
- Advertisement -

దియోటర్ అర్టిస్ట్ గా తెలుగు సినిమాకి పరిచయమయ్యి చాలా మంచి పేరు సంపాయిందచిన కార్తిక్ రత్నం  హీరోగా , స్టన్నింగ్ బ్యాూటి  సుప్యర్ద సింగ్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం లింగోచ్చా.. ఆనంద్ బడా ని దర్శకుడి గా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టొబర్ 27న  విడుదల కానుంది. ఆ చిత్రానికి జె నీలిమ సమర్సిస్తుండగామల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ప్రేక్షకుల మద్యలో జరిపారు.

హీరో కార్తిక్ రత్నం మాట్టడుతూ.. కంచెరపాలెం ప్రివ్యూ కి వచ్చి నన్ను దర్శకుడు ఆనంద్ హీరోగా సెలక్ట్ చేశాడు. నన్ను ఆ రోజే నమ్మాడు. లింగోచ్చా లో పక్కా హైదరాబాద్ కుర్రాడిలా కనిపిస్తాను.. ఒక వైవిధ్యమైన లవ్ స్టోరి కి కామెడి యాడ్ చేసి పాత్రల చిత్రీకరణ కూడా అందరికి నచ్చేలా డిజైన్ చేశారు. మ్యూజిక్ అయితే నేను ప్రతిరోజు వింటూనే వున్నా.. నిర్మాత గారు నన్ను తమ్ముడి లెక్క సక్కగా చూసుకున్నారు. హీరోయిన్ చాలా బాగా చేసింది. అలాగే సద్దాం వాళ్ళ కామెడి అదిరిపోయింది. నేను ఏ సినిమా , ఏ పాత్ర చేసినా కూడా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి నా ధన్యవాదాలు.. ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. అని అన్నారు

ఈ సందర్బంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ..  లింగోచ్చా గేమ్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ నెల 27 న ప్రేఓకుంల ముందుకు తీసుకువస్తున్నాం. నిర్మాత యాదగిరి రాజు గారు మాకు షూటింగ్ కి కావలసివి అన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఫిల్మ్ ని అందించారు. మా హీరో కార్తిక్ రత్నం నటుడుగా టాలీవుడ్ లో ప్రేక్షకుల హ్రుదయాల్లో స్థానం సంపాయించారు. హైదారాబాద్ కి సంభందించిన రొమాంటిక్ కామోడి విత్ లవ్ తో ఈ కథ నడుస్తుంది. హీరోయిన్ సుప్యర్ధ సింగ్ చాలా కాలం యువత కలల్లో వుండిపోతుంది. మా చిత్రానికి మ్యూజిక్ అందించిన బికాజ్ రాజ్ మంచి ట్యూన్స్ నే కాకుండా రీ రికార్డింగ్ సూపర్ గా చేశాడు.. ఈ చిత్రాన్ని ఇంత బాగా డిజైన్ చేసి మెయిన్ పిల్లర్ గా నిలిచిన అనిల్ కుమార్ తీగల గారికి ప్రత్యేఖం గా ధన్యవాదాలు.. పూర్తి లవ్ రొమాంటిక్ కామెడి తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది , హైదరాబాద్ లో బిర్యాని, ఇరాని ఛాయ్ లెక్క మా లింగోచ్చా కూడా ఫ్యామస్ అవుతుంది  అని అన్నారు.

నిర్మాత యాదగిరి రాజు మాట్లాడుతూ.. కార్తిక్ రత్నం చాలా మంచి యాక్టర్ అని అందరికి తెలుసు కాని మా లింగొచ్చా తో ఆయనలో వున్న స్టార్ యాక్టర్ ని మా దర్శకుడు పరిచయం చేశాడు. 27 న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.. మా హీరోయిన్ సుప్యర్ధ సింగ్ కొసం ధియెటర్స్ కి రిపీట్ వస్తారు. అలాగే సద్దాం గ్యాంగ్ తో మంచి కామెడి అందించారు. అని అన్నారు

హీరోయిన్ సుప్యర్థ సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా కొస్టార్ కార్తిక్ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే నన్ను చాలా క్యూట్ గా చూపించారు. నా కెరక్టర్ కి అందరూ ఫిదా అవుతారనేది సత్యం.. నిర్మాత , దర్శకుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా తప్పకుండా దియోటర్స్ లో విజయం సాధించాలని కొరుకుంటున్నాను అని్ అంది.

ప్రోడక్షన్ డిజైనర్ అనిల్ కుమార్ తీగల గారు మాట్లాడుతూ.. అందరి సహయం తో ఈ చిత్రం 27న విడుదల చేస్తున్నాం.. దియోటర్స్ లొ చూసి పెద్ద విజయాన్ని అందించాలని కొరుకుంటున్నాను. అని అన్నారు

చిత్ర సమర్పకురాలు జి. నీలిమ మాట్లాడుతూ.. యాదగిరి రాజు గారు సినిమా తీసామని చెప్పారు కాని ఇంత మంచి సినిమా తీసారని అనుకొలేదు.. ఈ చిత్రం చాలా బాగుంది. ఖచ్చింతం గా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాము. అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News