Wednesday, January 22, 2025

ఓటరు ఐడితో ఆధార్ ను అనుసంధానం చేసుకోండి: జిల్లా ఎన్నికల అధికారి

- Advertisement -
- Advertisement -

Link Aadhaar with Voter ID

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఓటరు లిస్ట్ లో పేరున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ కోరారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజక వర్గం లో గల ఓటర్లు, తమ ఆధార్ కార్డు నెంబర్ ను స్వచ్ఛందంగా లింక్ చేసుకునే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఆధార్ అనుసంధానం ప్రక్రియను వారు ఆన్ లైన్ ద్వారా గాని ఆప్ లైన్ ద్వారా గాని చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటీ వరకు తమ ఆధార్ అనుసంధానం చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ బూత్ లెవెల్ అధికారి ఇంటింటికి వచ్చి 6బి ఫోరంను పంపిణీ చేస్తున్నారన్నారు. , ఈ ఫారం ను నింపి తిరిగి బిఎల్‌ఓ కు గాని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కి ( ఈఆర్‌ఒ) గాని అంద జేస్తే సరిపోతుందని తెలిపారు.

ఆన్ లైన్ ద్వారాఅయితే www.nvsp.in ద్వారా గానీ voter helpline app ద్వారా ఆధార్ ను స్వచ్ఛందంగా లింక్ చేసుకోవాలన్నారు . ఓటరు లిస్టు లో తన పేరుండి ఆధార్ కార్డు లేని వారు కూడా ఎన్నికల కమిషన్ సూచించిన, 11 ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒక ధృవీకరణ పత్రం ను 6B దరఖాస్తు ద్వారా స్వచ్ఛందంగా అనుసంధాన చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఫోటో ఉన్న బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పెన్షన్ మంజూరు పత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు జారీ చేసిన గుర్తింపు కార్డు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ల ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఎదో ఒక్కటి సమర్పించి అనుసంధానం చేసుకోవచ్చాన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ నగర ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News