Sunday, December 22, 2024

ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. స్థిర, చరాస్తులను ఆధార్‌కి అనుసంధానం చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ సూచనలు చేసింది. దేశంలో నల్లధనం, అవినీతి , బినామీల నివారణకు ఆధార్‌తో అనుసంధానం ఒక కీలక చర్య అవుతుందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పూర్తి పరిశీలన తరువాత విచారణ ముగించినట్టు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను ఒక విజ్ఞాపనగా తీసుకుని పరిశీలించాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News