Friday, November 22, 2024

హైడ్రా చట్టబద్ధమే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : ‘హైడ్రాకు చట్టబద్దత ఉంది. ఆరువారాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు కాబోతుంది. అందులో అన్ని విషయాలు చర్చించి. ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు’ అని హైడ్రా కమిషన ర్ రంగనాథ్ వెల్లడించారు. శనివారం ఆయన మీ డియాతో మాట్లాడారు.. ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధ్దత కల్పించడానికి సన్నాహాలు చేస్తుందన్నారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, ఇరిగేషన్, రెవెన్యూ చట్టాలను పరిగణలోకి తీసుకుని హైడ్రాకు కూడా చట్టం చేయనున్నారని ఆయన వెల్లడించారు. ప్ర భుత్వం మార్గనిర్దేశకాలు జారీచేసే వరకు చెరువు ల్లో ఇండ్లు నిర్మించుకుని అందులోనే నివాసం ఉం టే మాత్రం ఆ ఇండ్లపై చర్యలు ఉండవని రంగనా థ్ స్పష్టంచేశారు. ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మించుకు న్న ఇండ్లకు ప్రభుత్వం ఏదేని పరిహారంగానూ, లే దా ఇతర ప్రాంతాల్లో ఇండ్లు, లేదా భూములు కే టాయించేట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. చె రువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై చట్టబద్ధంగా కేసులు నమోదు చేస్తామని, నిర్మాణాదారులు, అనుమతులు మంజూరు చేసిన అధికారుల వెనుక ఎవరైనా రాజకీయ నేతలు ఉంటే వారిపైనా కూడా చర్యలు తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

నిర్మాణాదారులపైనా కేసులు..
చెరువుల్లో సర్వేనెంబర్లు మార్చి, అధికారులను తప్పుదోవపట్టించి, ప్రభావితం చేసి అనుమతులు మంజూరు చేసుకున్న నిర్మాణాదారులపైనా చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అట్టి అనుమతులు రద్దు చేయాలని ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. పాత తేదీల్లోనూ అనుమతులు తీసుకుని, అధికారాలు లేని వారు కూడా అనుమతులు మంజూరు చేస్తే వారిపైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎఫ్‌టిఎల్, ప్ర భుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పదని ఆయన తెలిపారు. ఈపాటికే నియమనిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందనీ, నిర్మాణాదారులపైనా కేసులను ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే పోలీసు స్టేషన్ అందుబాటులోకి రాబోతుందనీ ప్రజలు నేరుగా అక్కడ ఫిర్యాదుదు అందజేసే సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లతో పాటు చెరువుల లింక్‌ల వాగులపై నిర్మాణాలు చేపడితే చర్యలు ఎప్పటికైనా తప్పవని కమిషనర్ సూచన ప్రాయంగా హెచ్చరికలు జారీచేశారు.

చెరువుల మధ్య లింక్‌లపైన..
ఔటర్ రింగ్ రోడ్ లోపలివైపున ఉన్న చెరువుల్లోని నిర్మాణాలను కూల్చడమే కాదు. కూల్చడం హైడ్రా ప్రధాన ఉద్దేశ్యం కాదనీ, చెరువుల వాస్తవ విస్తీర్ణం ఉండేలా చూడటం, చెరువులకు చెరువులకు మధ్య ఉన్న లింక్‌లను పునరుద్దరించడంపైనా హైడ్రా ఫోకస్ పెడుతుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను కలుపుతూ గతంలో ఉన్న కాలువలు, వాగులు, వరదనీటి నాలాలను పునరుద్దరించే దిశగా హైడ్రా ప్లాన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 195055 మధ్య కాలంలోని చెరువుల శాటిలైట్ మ్యాప్‌లను తీసుకుని వాటి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా విస్తీర్ణం,

వాటిలోని సర్వే నెంబర్లు, చెరువుల్లోకి చేరే వరద నీటి కాలువలు, వాటి వెడల్పు, ఆ కాలువలకుండే బఫర్ జోన్‌లను కూడా పునరుద్దరించేట్టుగా చర్యలు తీసుకోవాలనే దిశగా హైడ్రా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పలు చెరువుల్లో అనుమతులు లేకుండానూ, కొన్ని నిర్మాణాలకు పాత తేదీల్లో అనుమతులు మంజూరు చేసినట్టు హైడ్రా గుర్తించిందని వెల్లడించారు. ఈక్రమంలోనే నియమనిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే అధికారులైనా, నిర్మాణాదారులైనా చట్టపరంగా కేసులను ఎదుర్కోక తప్పదని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News