Monday, December 23, 2024

సింహం కూన మరణించడం చాలా బాధను కలిగించింది

- Advertisement -
- Advertisement -

‘జూపార్కులో గాల్లో దీపాల్లా వన్యప్రాణుల ప్రాణాలు’ కథనానికి స్పందన
జూపార్కులో చనిపోయింది ఆరు జింకలే అని తేల్చిన అధికారులు
సింహం కూన మూర్చతో మరణించినట్లు తేల్చిన పోస్టుమార్టం నివేదిక
ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి
మీర్ ఆలం జలాల కలుషితాలు జూలో ప్రవాహం : క్యూరేటర్ ఎస్. రాజశేఖర్

Lion dead in Nehru Zoological Park

మన తెలంగాణ / రాజేంద్రనగర్: భయాందోళనలో పిల్ల సింహానికి ఎలాంటి ఆపద రావొద్దని తల్లి సింహ ‘అదిష్న’ నుంచి వేరు చేసి బేబి కేర్ సెంటర్‌లో వెటర్నరీ సి బ్బంది చేతుల మీదుగా పెంచుతున్న సింహం కూన అకస్మత్తుగా మరణించడం చాలా బాధను కలిగించిందని జూ పార్కు క్యూరేటర్ ఎస్.రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా పాలుపట్టి ఆరోగ్యంగా పెంచుతున్న సిం హం కూన ఊపిరితిత్తులు సరిగా పనిచేయక, మూర్చ వ్యా ధితో చనిపోయినట్లు వెటర్నరీ నిపుణుల బృందం నిర్వహించిన పోస్టుమార్టంలో తేలినట్లు ఆయన తెలిపారు.

ఈనెల 4వ తేదీన ‘జూపార్కులో గాల్లో దీపాల్లా వన్యప్రాణుల ప్రాణాలు’ అనే శీర్షికన ‘మన తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఆయన తీవ్రంగా స్పందించారు. ఈవిషయమై సోమవారం ‘మన తెలంగాణ’తో మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల ఆరు జిం కలు మరణించాయన్నారు. అయితే ఆదివారం కూడా జూలో మరో హాగ్ డీర్ మృత్యువాత పడింది. మృతి చెందిన జింకల్లో బార్కింగ్ డీర్స్ రెండు, సాంబర్ డీర్స్ రెండు ఉండగా, మరో రెండు నాల్గాయ్ రకం జింకలు మరణించాయన్నారు. జూలై మా సంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వాతావరణ, పర్యావరణ మార్పుల కారణంగా జింకలు మరణించాయని తెలిపారు. సాధారణంగా వాతావరణ మార్పుల సమయంలో జింకలు మరణిస్తుంటాయని చెప్పారు.

ఇక రియా పక్షి జాతిలో ఆ పక్షుల సంతానోత్పత్తి స మస్య వల్ల పిల్ల రియాలు చనిపోయాయని చెప్పారు. కలుషిత నీటి కారణంగా జంతువులు అనారోగ్యాలకు గురి కాలేదని, కానీ జూపార్కుకు ఆనుకుని ఉన్న మీర్ ఆలం ట్యాంక్ భారీ వర్షాల కారణంగా నిండిపోయి అధిక జలాలు జూపార్కులో గుండా ప్రవహించాయని, అలా మూసీలో కలుస్తామని, దాంతో కొంత సమస్య ఉత్పన్నం అ యిందన్నారు. జూపార్కులోని జంతువులు, పక్షులకు ఆర్‌వో వాటర్ అందిస్తున్నామని తెలిపారు. కలుషిత నీటి సమస్య వన్యప్రాణులకు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వివిధ విభాగాల అధికారులు నిర్దేశించిన విధులను నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా ఆయా రామ్.. గయా రామ్‌ల లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. దీనిపై స్వీయ పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు వెల్లడించారు. జూలోని ప్రతి ప్రాణి తమకు సొంత పిల్లలలో సమానమని ఆయన పేర్కొన్నారు. నాణ్యత లేని ఫీడ్ వల్ల వన్యప్రాణులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిత్యం ఫీడ్ ఐటమ్స్ డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ, అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ, అసిస్టెంట్ క్యూరేటర్-1, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌లకు గతంలోనే ఆదేశాలు ఇ వ్వడం జరిగిందని, డిప్యూటీ క్యూరేటర్ ఆహార నాణ్యత పై ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక పర్యవేక్షణ కొసాగిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News