- Advertisement -
మరో తొమ్మిది మృగరాజులకు వైరస్
చెన్నై : కరోనా వైరస్ కాటుకు చెన్నై జూలో ఓ సింహం పద్మనాథన్ బలి అయింది. ఇక్కడికి సమీపంలోని అరిగ్నర్ అన్నా జూవాలాజికల్ పార్క్లో 12 ఏండ్ల సింహానికి ఈ నెల 3వ తేదీన కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్థారించారు. దీనితో పెద్ద ఎత్తున సింహానికి వెటర్నరీ సిబ్బంది ఆధ్వర్యంలో చికిత్స జరిగింది. అయితే ఫలితంలేకుండా పోయింది. బుధవారం ఉదయం ఈ సింహం మృతి చెందిన విషయాన్ని జూ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా జూలలో ఉన్న చిరుతలు, ఎలుగుబంట్లు ఇతర జీవాలకు కరోనా సోకిన విషయం నిర్థారణ కావడంతో అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకొంటోంది. చెన్నై శివార్లలోని ఈ జూలోనే ఈ మధ్యనే తొమ్మిదేండ్ల ఆడసింహం నీలా కరోనాతో చనిపోయింది. జూలోని మరో తొమ్మిది బందీగా ఉన్న సింహాలకు కొవిడ్ వచ్చినట్లు నిర్థారణ అయిందని ఈ నెల 4వ తేదీన అధికారులు తెలిపారు.
- Advertisement -