Wednesday, January 22, 2025

మెస్సీ @ 1000

- Advertisement -
- Advertisement -

మెరుపు గోల్‌తో రొనాల్డో రికార్డు బద్దలు
21 తేడాతో ఆస్ట్రేలియాపై అర్జెంటీనా గెలుపు
క్వార్టర్స్‌బెర్త్ ఖరారు

ఖతార్ : అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ప్రపంచకప్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు గోల్ చేసిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ(35) రికార్డు సృష్టించాడు. దోహాలోని అలీ స్టేడియంలో కంగారూలపై జరిగిన మ్యాచ్ ప్రథమార్థంలో గోల్ సాధించిన మెస్సీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జూలియన్ అల్వారేజ్ 57వ నిమిషంలో మరో గోల్ చేయడంతో ఈ మ్యాచ్‌లో 21తేడాతో గెలిచిన బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు మూడుగోల్స్ తన ఖాతాలో వేసుకున్న మెస్సీకి నాకౌట్ దశలో ఇది తొలి గోల్.

మొత్తంమీద ప్రపంచకప్పుల్లో మెస్సీకి 9వ గోల్. ఈక్రమంలో ప్రపంచకప్ టోర్నీల్లో ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతోపాటు స్వదేశం అర్జెంటీనాకు చెందిన లెజెండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మారడోనా ఎనిమిది గోల్స్ రికార్డును అధిగమించాడు. కాగా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ రెండోస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అర్జెంటీనా గాబ్రియెల్ బటిస్టుటా 10గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు మెస్సీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో 1000 మ్యాచ్‌ల మైలురాయిని దాటాడు.

రొనాల్డో వెయ్యో మ్యాచ్ 2020లో పూర్తిచేసుకున్నాడు. రొనాల్డో 725 గోల్స్‌చేసి మరో 216గోల్స్‌కు సహకరాన్ని అందించాడు. మెస్సీ 789గోల్స్ చేసి సహకరించి రొనాల్డో కంటే ముందున్నాడు. కాగా రెండుస్లారు ఛాంపియన్‌గా నిలిచిన 21తో సౌదీ అరేబియా చేతిలో ఓటమిపాలైనా అనంతరం కోలుకుని క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకువచ్చింది. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా శుక్రవారం అజేయ నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News