Monday, December 23, 2024

$10 మిలియన్ల విలువైన మెస్సీ ‘ఫిఫా వరల్డ్ కప్’ జర్సీలు వేలం..

- Advertisement -
- Advertisement -

అర్జెంటీనా గెలుపొందిన 2022 ప్రపంచ కప్ రన్ సందర్భంగా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీల సెట్‌ను డిసెంబర్‌లో వేలం వేయనున్నట్లు సోథెబీ సోమవారం ప్రకటించింది. వాటి విలువ దాదాపు $10 మిలియన్లుగా అంచనా వేసింది. సౌదీ అరేబియా, మెక్సికోతో జరిగిన గ్రూప్-స్టేజ్ రౌండ్‌లో.. అలాగే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, క్రొయేషియాతో జరిగిన గేమ్‌లలో.. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఈ షర్టులను లియోనెల్ మెస్సీ ధరించాడు.

గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో విజయం సాధించి అర్జెంటీనా ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, లియోనెల్ మెస్సీ ధరించిన ఈ జెర్సీలు $10.1 మిలియన్ల కంటే ఎక్కువకు అమ్ముడుపోతే.. ఇప్పటివరకు వేలం వేయబడిన క్రీడా స్మృతి చిహ్నాలలో అత్యంత విలువైనవిగా నిలుస్తాయని సోథెబీ తెలిపింది.

1998లో చికాగో బుల్స్‌తో జరిగిన ఎన్ బిఎ ఫైనల్స్‌లో బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ధరించి జెర్సీ.. వేలంలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన వ్యక్తిగత జెర్సీగా ఉంది. ఈ జెర్సీ గతేడాది $10.1 మిలియన్లకు విక్రయించబడింది.

యుఎస్ టెక్ స్టార్టప్ ఎసి మొమెంటో ద్వారా ఈ షర్టులను వేలానికి తీసుకువస్తున్నారు. వేలంలో వచ్చిన కొంత మొత్తాన్ని యుఎన్ఐసిఎఎస్ ప్రాజెక్ట్‌కి విరాళంగా అందజేయబడుతుంది. బార్సిలోనా పిల్లల ఆసుపత్రిలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు యుఎన్ఐసిఎఎస్ సహాయం చేస్తుంది. వేలం వేయనున్న ఈ జెర్సీలను ఉచితంగా ప్రజలు చేసేందుకు నవంబర్ 30 నుండి డిసెంబర్ 14 వరకు అందుబాటులో ఉంచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News